వేసిన తొలి బంతికే వికెట్ తీసిన షమీ.. దిగ్గజ బౌలర్ రికార్డ్ బ్రేక్ చేశాడు..!
2023 ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి అవకాశం రాకలేదు.
By Medi Samrat Published on 22 Oct 2023 10:21 AM GMT2023 ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి అవకాశం రాకలేదు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో జరిగే బిగ్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే.. షమీ ఈ మ్యాచ్‌లో తన మార్క్ చూపించాడు. టోర్నమెంట్‌లో తాను వేసిన మొదటి బంతికే అద్భుతం చేశాడు. షమీ 9వ ఓవర్లో తన స్పెల్ ప్రారంభించాడు. మొదటి బంతికే కివీస్ బ్యాట్స్‌మెన్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తద్వారా షమీ ప్రపంచ కప్‌లో ప్రత్యేక రికార్డును కూడా సృష్టించాడు. దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బ్యాట్స్‌మెన్‌గా మహ్మద్ షమీ తొలి వికెట్ పడగొట్టిన వెంటనే అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. విల్ యంగ్ వికెట్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో షమీకి 32వ వికెట్. గత ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించి షమీ అరుదైన రాకిర్డును నమోదు చేసుకున్నాడు. చేతన్ శర్మ తర్వాత ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపుపొందాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఈ మ్యాచ్‌లో షమీకి అవకాశం దక్కింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (భారత్)
44 - జహీర్ ఖాన్
44 – జవగల్ శ్రీనాథ్
32* – మహ్మద్ షమీ*
31 - అనిల్ కుంబ్లే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఓడిపోలేదు. ఈరోజు ఎవరు గెలిస్తే వారు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు.