ఆ రికార్డ్ బద్దలు కొట్టగానే హర్భజన్‌కు సైగల ద్వారా తెలిపిన షమీ.. వీడియో వైరల్
ప్రపంచకప్‌లో భారత్ నాలుగుసార్లు శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ తన పదునైన
By Medi Samrat Published on 3 Nov 2023 10:42 AM GMTప్రపంచకప్‌లో భారత్ నాలుగుసార్లు శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ తన పదునైన బౌలింగ్ తో రెచ్చిపోయాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌కు శ్రీలంక బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. షమీ 5 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. షమీ ఈ మ్యాచ్‌లో మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. రికార్డు బద్దలైన వెంటనే.. మహ్మద్ షమీ మైదానం మధ్యలోనుంచి హర్భజన్ సింగ్ వైపు చూపడం ప్రారంభించాడు.
భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ సందర్భంగా హర్భజన్ సింగ్ కామెంటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతగా దర్శనమిచ్చాడు. హర్భజన్ సింగ్ వన్డే క్రికెట్‌లో మొత్తం 3 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. నిన్న శ్రీలంకపై షమీ 5 వికెట్లు పడగొట్టగా.. అతడు హర్భజన్ సింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. వన్డేల్లో షమీ మొత్తం 4 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత షమీ కామెంటరీ బాక్స్ వైపు చేతిని చూపుతూ.. బంతిని చేతిలోకి తీసుకుని తలపై గుండ్రంగా తిప్పుతూ హర్భజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టినట్లు సైగల ద్వారా తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
షమీ రియాక్షన్‌కి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ కేవలం 3 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. భారత్ తరఫున ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. షమీ అంతకుముందు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 4 వికెట్లు పడగొట్టగా, న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీశాడు.