ఫైనల్ ను అడ్డుకుంటాం
సెప్టెంబరులో భారత్-పాకిస్తాన్ మధ్య ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు ముందు నిషేధిత ఖలిస్తానీ సంస్థ
By Medi Samrat Published on 18 Nov 2023 3:30 PM GMTసెప్టెంబరులో భారత్-పాకిస్తాన్ మధ్య ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు ముందు నిషేధిత ఖలిస్తానీ సంస్థ 'సిఖ్స్ ఫర్ జస్టిస్' వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే!! పాకిస్థాన్-భారత్ ప్రపంచ కప్ మ్యాచ్ ను జరగనివ్వమని హెచ్చరించాడు. దీంతో అతనిపై FIR నమోదు చేశారు.
ఇప్పుడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ విషయంలో కూడా అలాంటి బెదిరింపులకు దిగాడు. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌ను అడ్డుకుంటామని బెదిరిస్తూ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడాడు. ముస్లిం, క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు గురుపత్వంత్ సింగ్.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ ప్రారంభం కానున్నది. ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మారెల్స్ హాజరుకానున్నారు.