న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్ స్థానంకై ఆ ముగ్గురి మ‌ధ్య పోటీ..!

న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌కి ముందు భారత జట్టుకు చేదు వార్త అందింది. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా

By Medi Samrat  Published on  20 Oct 2023 11:19 AM GMT
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్ స్థానంకై ఆ ముగ్గురి మ‌ధ్య పోటీ..!

న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌కి ముందు భారత జట్టుకు చేదు వార్త అందింది. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కివీస్‌తో మ్యాచ్‌కు మైదానంలోకి దిగే అవ‌కాశం లేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో హార్దిక్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ల ముందున్న పెద్ద ప్రశ్న. హార్దిక్ స్థానంలో మైదానంలోకి దిగేందుకు రేసులో ముందంజలో ఉన్న ఆ ముగ్గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

1. సూర్యకుమార్ యాదవ్

హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మంచి ఎంపిక కావచ్చు. తన బ్యాటింగ్‌తో ఎలాంటి మ్యాచ్‌నైనా మార్చే సత్తా సూర్యకు ఉంది. దీంతో పాటు మిడిల్ ఓవర్లలో రన్ రేట్ ను కాపాడుకుంటూ ఇన్నింగ్స్ ను నిర్మించ‌గ‌ల‌ నైపుణ్యం కూడా సూర్యకుమార్ సొంతం. అయితే సూర్యకుమార్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభిస్తే.. భారత జట్టు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌ను జట్టులోకి తీసుకోవలసి ఉంటుంది.

2. ఇషాన్ కిషన్

హార్దిక్ పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు. ఇషాన్ ఇప్పటికే మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ 47 పరుగులతో ప‌ర్వాలేద‌నిపించాడు. హార్దిక్ స్థానంలో కెప్టెన్ రోహిత్ ఇషాన్‌ని కూడా ఆడించే అవ‌కాశం ఉంది.

3. రవిచంద్రన్ అశ్విన్

హార్దిక్ పాండ్యా స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అశ్విన్ జట్టులోకి వ‌స్తే బౌలింగ్‌తో పాటు.. బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయ‌గ‌ల‌డు. హార్దిక్ జట్టులో లేకుంటే శార్దూల్, అశ్విన్‌లకు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో అవకాశం దక్కవచ్చు. భారత జట్టు ఆదివారం అంటే అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Next Story