సౌతాఫ్రికాపై టీమిండియా భారీ విజ‌యం

వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో

By Medi Samrat  Published on  5 Nov 2023 9:15 PM IST
సౌతాఫ్రికాపై టీమిండియా భారీ విజ‌యం

వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. అంత‌కుయుందు కోహ్లీ(101), శ్రేయ‌స్ అయ్య‌ర్(77) రాణించ‌డంతో భారత్ 326 ప‌రుగులు భారీ స్కోరు చేసింది.. వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచింది.

Next Story