షమీకి 5 వికెట్లు.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం 273

భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాల వేదికగా సాగుతున్న మ్యాచ్ లో డారెల్ మిచెల్(130) సెంచరీతో చెలరేగాడు.

By Medi Samrat  Published on  22 Oct 2023 6:45 PM IST
షమీకి 5 వికెట్లు.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం 273

భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాల వేదికగా సాగుతున్న మ్యాచ్ లో డారెల్ మిచెల్(130) సెంచరీతో చెలరేగాడు. భారత్ ముందు న్యూజిలాండ్ 273 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కివీస్ స్కోర్ 300 దాటుతుందనిపించినా.. ఆఖరిలో భారత బౌలర్లు వికెట్లు తీసి కట్టడి చేయగలిగారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లలో కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(0), విల్ యంగ్(17) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర(75), మిచెల్(130) జోడి 3వ వికెట్ కు 159 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇన్నింగ్స్ ఆఖరిలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 273 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు క్యాచ్ లను వదిలిపెట్టడం కివీస్ ఆటగాళ్లకు కలిసొచ్చింది. మిచెల్, రవీంద్ర తర్వాత ఫిలిప్స్ చేసిన 23 పరుగులే కివీస్ ఆటగాళ్లు చేసిన థర్డ్ హయ్యస్ట్ రన్స్. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా నిలవనుంది.

Next Story