ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు అత‌డే అర్హుడు.. కోహ్లీ, రోహిత్‌ల‌కు షాకిచ్చిన యువరాజ్..!

భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరల్డ్ కప్-2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్అవార్డు

By Medi Samrat  Published on  19 Nov 2023 5:38 AM GMT
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు అత‌డే అర్హుడు.. కోహ్లీ, రోహిత్‌ల‌కు షాకిచ్చిన యువరాజ్..!

భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరల్డ్ కప్-2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్అవార్డు ఎవ‌రికి ద‌క్కుతుందో వెల్లడించాడు. యువరాజ్ సింగ్ ప్ర‌క‌ట‌న ద్వారా ఇన్-ఫార్మ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చాడు.

2023 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ద‌క్కుతుంద‌ని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టాక్‌తో జరిగిన సంభాషణలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "భారత్ ఎప్పుడూ బెంచ్‌లో మ్యాచ్ విన్నర్‌లను కలిగి ఉంటుంది. హార్దిక్ పాండ్యా గాయప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే షమీ ఎలా రాణిస్తున్నాడో చూడాలి. అతని బంతులు నిప్పులు చిమ్మిన తీరు అద్భుతం. నా అభిప్రాయం ప్రకారం.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు ఎవరైనా అర్హులంటే.. అది మహమ్మద్ షమీ మాత్ర‌మేన‌ని పేర్కొన్నాడు.

2023 ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లలో షమీకి ప్లేయింగ్ 11లో అవకాశం రాలేదు. కానీ హార్దిక్ పాండ్యాకు గాయం తర్వాత అవకాశం లభించింది. దీంతో షమీ తన భీక‌ర‌మైన‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లో భయాన్ని నింపాడు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ టోర్నీలో షమీ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్‌లో 50కి పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ష‌మీ 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.

భారత్ 1983, 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మూడోసారి భారత్‌ను వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ త‌న అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. గతంలో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ టైటిల్ గెలుచుకుంది.

Next Story