ఇక్కడ బెన్ స్టోక్స్ వచ్చాడు.. అక్కడ బవుమా బయటకు
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు.
By Medi Samrat Published on 21 Oct 2023 2:46 PM ISTఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు.ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతూ ఉండగా.. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్ ఈ మ్యాచ్ ద్వారా బరిలో దిగనున్నాడు.
ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా సాగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 3 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే నెగ్గింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... ఆ తర్వాత బంగ్లాదేశ్ పై నెగ్గింది. మూడో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కు ఎంతో కీలకం. దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‍లో ఆ జట్టుకు కెప్టెన్సీ ఐడెన్ మార్క్‌రమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. బవుమా అనారోగ్యం బారిన పడ్డాడని, అందుకే విశ్రాంతి ఇచ్చినట్టు టాస్ సమయంలో చెప్పాడు మార్క్‌రమ్. అతడి స్థానంలో రెజాను తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రెజా హెండ్రిక్స్, రాసీ వాన్ డర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, లుంగీ ఎంగ్డీ
ఇంగ్లండ్: జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, గుస్ అట్కిసన్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ