సెమీ-ఫైనల్‌కు ముందు రోహిత్‌కు జ‌ట్టులో ద‌క్క‌ని చోటు.. కెప్టెన్‌గా విరాట్.. మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రంటే..

నవంబర్ 15న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.

By Medi Samrat  Published on  13 Nov 2023 3:32 PM IST
సెమీ-ఫైనల్‌కు ముందు రోహిత్‌కు జ‌ట్టులో ద‌క్క‌ని చోటు.. కెప్టెన్‌గా విరాట్.. మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రంటే..

నవంబర్ 15న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా లీగ్ దశలో మొత్తం 9 లీగ్ మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌ మాత్రమే ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. అయితే సెమీఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కని కొత్త జట్టు ఆవిర్భవించింది. అలాగే విరాట్ కోహ్లీని ఆ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ఈ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

ఈ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రపంచ కప్‌లో ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా తన ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈ జట్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ సహా మొత్తం నలుగురు ఆటగాళ్లు ఉన్నారు.


అలాగే ఇతర దేశాల గురించి మాట్లాడితే.. నలుగురు భారతీయులు కాకుండా.. న్యూజిలాండ్, శ్రీలంక నుండి ఒక్కొక్కరు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి 3 మంది ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. విశేషమేమిటంటే ఈ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా విరాట్ ను ఎంపిక చేసింది. 2021లో కెప్టెన్‌ పదవికి విరాట్‌ కోహ్లి రాజీనామా చేయడం గమనార్హం. అయినప్పటికీ.. CA ద్వారా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా వెలుగొందిన రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.

ఇది 12 మంది సభ్యుల బృందం

క్వింటన్ డి కాక్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సన్, ఐడెన్ మార్క్‌రామ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్‌ప్రీత్ బుమ్రా, దిల్షన్ మధుశంక (12వ).


Next Story