ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అయిపోగానే బాబర్ అజామ్ షాక్ ఇవ్వనున్నాడా..?
ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ దాదాపు నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్థాన్ వరుసగా
By Medi Samrat Published on 11 Nov 2023 2:56 PM ISTప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ దాదాపు నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్థాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే పరిస్థితి నెలకొంది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బాబర్ అజామ్ ఇప్పుడు వన్డే మాత్రమే కాకుండా టీ-20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడని నివేదికలు పేర్కొంటున్నాయి.
బాబర్ అజామ్ కెప్టెన్సీపై విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ముందుగా ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘోరంగా నిష్క్రమించింది. ఆ తర్వాత బాబర్ కెప్టెన్సీలోనే పాకిస్తాన్ ప్రపంచ కప్ నుండి దాదాపుగా నిష్క్రమించింది. దీంతో బాబర్ ఆజం చాలా కాలంగా విమర్శల పాలవుతున్నాడు. బాబర్ అజామ్‌కు కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో తెలియదని.. అందుకే అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పలువురు పాకిస్థాన్ మాజీ వెటరన్ క్రికెటర్లు కూడా అన్నారు. అటువంటి పరిస్థితిలో బాబర్ ఆజం కూడా ఈ విమర్శలతో విసిగిపోయాడు. దీంతో ప్రపంచకప్ తర్వాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే వాదన వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌కు చివరి మ్యాచ్ కానుంది.
విమర్శకులతో విసిగిపోయిన బాబర్ ఆజం.. నాకు సలహా ఇవ్వాలనుకునే వారు ఇంట్లో కూర్చుని ప్రకటనలు చేయవద్దని అన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నా నంబర్ ఉంది, వారు నేరుగా నాకు కాల్ చేసి నాకు సలహా ఇవ్వగలరు. ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆలోచనా విధానం ఉంటుందని.. టీవీలో కూర్చుని సలహా ఇవ్వడం చాలా సులభం అని బాబర్ చెప్పారు. బాబర్ కెప్టెన్సీ కారణంగా పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో చీలిక వచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది రెండు శిబిరాలుగా విభజించబడిందని వార్తలు వచ్చాయి.