ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రెసిడెంట్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెక్రటరీ 'జై షా' కారణంగా శ్రీలంక క్రికెట్ నాశనం అయిందని, ఆయన తన పదవిని ఉపయోగించి శ్రీలంక క్రికెట్ ను నాశనం చేసారంటూ.. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఆరోపించారు.
శ్రీలంక క్రికెట్ పతనానికి బీసీసీఐకి చెందిన జై షాపై అర్జున రణతుంగ ఆరోపణలు చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డులోని కొందరు పెద్దలకు.. జై షాకు మధ్య ఉన్న సంబంధం కారణంగా శ్రీలంక క్రికెట్ కు ఈ గతి పట్టిందని అన్నారు అర్జున రణతుంగ. జై షా శ్రీలంక క్రికెట్‌ను నడుపుతున్నాడు. జై షా ఒత్తిడి కారణంగా శ్రీలంక క్రికెట్ నాశనమవుతోంది. భారతదేశంలోని ఒక వ్యక్తి శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడని రణతుంగ ఆరోపించారు. జైషా తండ్రి భారత హోం మంత్రి కావడం వల్ల మాత్రమే అతను ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా అనిపిస్తున్నాడని రణతుంగ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం కారణంగా.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేసింది.