ఆనంద్ మహీంద్రా 'జెర్సీ నంబర్ 55' ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా క్రికెట్ వీరాభిమాని అనడంలో సందేహం లేదు.
By Medi Samrat Published on 7 Oct 2023 2:51 PM ISTవ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా క్రికెట్ వీరాభిమాని అనడంలో సందేహం లేదు. రెండు రోజుల క్రితం.. ఆనంద్ మహీంద్రా X లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో 55 నంబర్‌తో కూడిన టీమ్ ఇండియా జెర్సీ కనిపిస్తుంది.ఆయన పోస్ట్‌లో "నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు BCCI, టెక్ మహీంద్రా" అనే క్యాప్షన్‌ను రాశారు.
ఈ ట్వీట్ ప్రజలలో అనేక ప్రశ్నలు, ఊహాగానాలకు దారితీసింది. అందరూ 55 నెంబర్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా తన జెర్సీ నంబర్ 55ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు ఇది ఆయన అదృష్ట సంఖ్య అని కొందరు ఊహించగా.. మరికొందరు అది ఆయన పుట్టిన సంవత్సరం కావచ్చునని ఊహించారు.
ఎవరు గుర్తించగలరో చూడాలని నేను ఆసక్తిగా ఉన్నాను..." అని ఆనంద్ మహీంద్రా కూడా మరో ట్వీట్ చేశారు. చాలా మంది 'లక్కీ' నంబర్ 55 వెనుక ఉన్న కారణాన్ని సరిగ్గా ఊహించారు.
ఊహాగానాల నడుమ ఆనంద్ మహీంద్రా స్వయంగా ఈ రహస్యాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మరో పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, "మీరందరూ దీన్ని సులభం చేసారు! అవును. నా పుట్టిన తేదీ 1-5-55. 5 నా లక్కీ నెంబర్ అని కూడా పంచుకున్నారు. అలాగే ఒక ఆసక్తికరమైన యాదృచ్చిక సంఘటనను కూడా పంచుకున్నారు. ఆయన 1991లో మహీంద్రా & మహీంద్రాలో చేరినప్పుడు.. 5 కంపెనీ అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుందని ఆయన తెలుసుకున్నాడు. ఇది వారి ప్రారంభ ట్రాక్టర్ల నంబరింగ్‌లో వ్రాయబడినట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈ సంవత్సరం భారత్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. 1975లో పురుషుల ప్రపంచ కప్ ప్రారంభమవగా.. ఇది 13వ ఎడిషన్.