ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రం ఇచ్చిన సచిన్

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్ నేడు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు

By Medi Samrat  Published on  7 Nov 2023 10:17 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రం ఇచ్చిన సచిన్

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్ నేడు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రాన్ని అందించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు.. సచిన్ ఆఫ్ఘనిస్తాన్ శిక్షణా శిబిరానికి చేరుకున్నాడు. అక్క‌డ‌ చాలా మంది ఆఫ్ఘన్ ఆటగాళ్లతో మాట్లాడాడు. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లందరినీ సచిన్ అభినందించాడు. సచిన్ రాబోయే మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌ని శుభాకాంక్షలు తెలిపాడు.

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక X హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు వీడియోలో సచిన్ టెండూల్కర్.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లతో మాట్లాడ‌టం చూడవచ్చు. వీడియోలో స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్‌తో పాటు, ఇత‌ర‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను పోస్ట్ చేసి.. ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల శిక్షణ శిబిరానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వచ్చి ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు సాధించిన విజయాల‌కి మమ్మల్ని అభినందించాడు. సచిన్ తన విలువైన అనుభవాల‌ను కూడా ఆట‌గాళ్ల‌తో పంచుకున్నట్లు పోస్ట్‌లో రాశారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రం లభించిన‌ట్ఐంది. ICC ప్రపంచ కప్ 2023లో 39వ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే 8కి 6 విజయాలతో సులువుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌కు నేటి విజయం సెమీఫైనల్‌కు దారులు మూసుకుపోకుండా చేయ‌గ‌ల‌దు. అటువంటి పరిస్థితితుల‌లో సచిన్ నుంచి అందుకున్న మంత్రం ఆఫ్ఘనిస్తాన్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Next Story