జట్టు కెప్టెన్ మంచి క్రికెటర్‌గానే కాదు.. మంచి మనిషిగా కూడా ఉండాలి

2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది.

By Medi Samrat  Published on  29 Oct 2023 3:45 PM IST
జట్టు కెప్టెన్ మంచి క్రికెటర్‌గానే కాదు.. మంచి మనిషిగా కూడా ఉండాలి

2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. పాక్‌ టీమ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు, నాలుగు ఓటములు మూట‌గ‌ట్టుకుంది. దీంతో పాకిస్థాన్ కేవ‌లం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో జట్టు సార‌ధి బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రజలు ఎప్పటికప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది మాత్రమే కాదు.. అతని స్థానంలో మరొక ఆటగాడికి జట్టు ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌ని చాలా మంది మాజీ వెటరన్ క్రికెటర్లు సూచిస్తున్నారు. పీసీబీ కూడా అదే వైఖరిని అవలంబించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ జియో న్యూస్‌తో సంభాషణ సందర్భంగా మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్‌లో బాబర్ ఆజం స్థానంలో.. 'మీరు కెప్టెన్సీని మార్చాలనుకుంటే.. మీకు చాలా ఆప్ష‌న్స్‌ ఉన్నాయి. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నుంచి మహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ వరకు పేర్లు ఉన్నాయి. 'జట్టు కెప్టెన్ మంచి క్రికెటర్‌గానే కాకుండా మంచి మనిషిగా కూడా ఉండాలన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆ నాణ్యత ఉంది.. మీరు వాటిని ఆ ఆట‌గాళ్ల‌లో చూడవచ్చని అన్నాడు.

Next Story