36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత బౌలర్లు విరుచుకుప‌డ్డారు.

By Medi Samrat  Published on  14 Oct 2023 2:01 PM GMT
36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత బౌలర్లు విరుచుకుప‌డ్డారు. 155 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మంచి స్థితిలో ఉన్న పాకిస్థాన్ జట్టు.. 191 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా అంద‌రూ మెగా మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించారు.

పాకిస్థాన్ జట్టు చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు క‌నిపించింది. రిజ్వాన్ యాభైకి చేరువగా(49) వ‌ద్ద‌ అవుట్ కాగా.. బాబర్ అజామ్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే.. బాబర్ అవుటైన వెంటనే పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడ‌లా కూలిపోయింది. 155 పరుగుల స్కోరు వద్ద బాబ‌ర్‌ వికెట్ ప‌డ‌గా.. 191 పరుగులకే జ‌ట్టు ఆలౌట‌య్యింది. అంటే పాకిస్థాన్ కేవ‌లం 36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బాబర్ అజామ్‌ సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ త‌ర్వాత‌ పాక్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని కుల్దీప్ యాదవ్ శాసించాడు. కుల్దీప్ మొదట సౌద్ షకీల్‌, త‌ర్వాత‌ ఇఫ్తికార్ అహ్మద్‌ను అవుట్ చేశాడు.

Next Story