ఆర్ధిక మాంద్యం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 12:10 PM GMT
ఆర్ధిక మాంద్యం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..!!

ఆర్థిక మాంద్యం అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్‌ వరకు ఏ దేశాన్ని వలదడం లేదు. కీలక రంగాలను కుదేలు చేస్తూ ప్రభుత్వాలను భయపెడుతోంది. సంక్షే మానికి పెద్దపీట వేసి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసిన దేశాలు మాంద్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడడానికి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. మాంద్యం నుంచి గట్టెక్కడానికి ఆయా దేశాలు వడ్డీ రేట్లను తగ్గించినా, బాండ్లు జారీ చేసినా, బ్యాంకులకు మూలధనం కల్పించినా, కీలక రంగాలకు చేయూతనిచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

మార్కెట్‌లో వస్తువులకు డిమాండ్‌ పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలిం చడం లేదు. ఐతే, ప్రభుత్వాలు అసలు రోగానికి మందు వేయకుండా పైపై పూతలతో సరిపెడుతున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రజల దగ్గర డబ్బులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి మార్కెట్లు నిస్తేజంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకుండా, సామాన్యుడి సమస్యలను పరిష్క రించే దిశగా అడుగులు వేయకపోవడమే మాంద్యం విలయతాండవానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు మేళాలు పెట్టడం, తక్కువ వడ్డీల కు రుణాలు ఇవ్వడంతోనే సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగదని, మార్కెట్‌లో ప్రజలకు ఉపాధిని కల్పించి, సకాలంలో చెల్లింపులు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు..

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ప్రస్తుత ఆర్థిక మందగమనానికి కూడా చాలా కారణాలున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇతర దేశాల వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మధ్య ప్రాచ్యంలో అలజడి సృష్టించాయి. బ్రెగ్జిట్ డీల్ కుదుర్చుకోవడంలో బ్రిటన్‌ ఆలస్యం చేయడం యూరప్ దేశాలను ప్రభావితం చేసింది. మొత్తంగా, గ్లోబలైజేషన్ కారణంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న సమస్య వచ్చినా, అది అంతర్జాతీయంగా ప్రభావం చూపుతోంది. అది మనదేశంపై కూడా పడింది. ఐతే, మాంద్యం ప్రభావం నుంచి బయటపడడానికి మోదీ సర్కారు సత్వరమే చర్యలు తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్దీపన చర్యలు ప్రకటించారు. బ్యాంకులకు మూలధనం కల్పించడంతో పాటు కీలక రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. కార్పొరేట్ సెక్టార్‌కు ఊతమివ్వడానికి కార్పొరేట్ టాక్స్‌ను 10 శాతం తగ్గించారు. ఐతే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనమే ఇచ్చాయి. వారం, పది రోజులు కాస్త ఊపు వచ్చిన ప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్షేత్రస్థాయి వాస్తవాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజల్లో ఖర్చు చేసే శక్తి తగ్గిపోవడమే కీలక రంగాల్లో కుంగుబాటుకు కారణమని గుర్తించిన ప్రభుత్వం.. మౌలిక రంగంలో భారీగా పెట్టుబడులకు తెరలేపింది. విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ పెట్టుబడిదారు లను ఆకర్షించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు.

27 ఏళ్ల కనిష్టస్థాయికి చైనా వృద్ధిరేటు..!

ఆర్థికమాంద్యం అన్ని దేశాలను వణికిస్తోంది. ఇటలీ, బ్రిటన్‌లలో జీడీపీలో లోటు నమోదవుతోంది. అమెరికా, చైనాలు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొం టున్నాయి. చైనా వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. పరిస్థితి మరింత దిగజారకుండా జిన్‌పింగ్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొనుగోలు శక్తి పెంచడానికి కార్యాచరణ ప్రారంభించింది. జపాన్‌లోనూ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. 2019లో జపాన్‌ జీడీపీ వృద్ధిరేటులో 3 శాతం లోటు నమోదవగా, 2020 లో 2.2 శాతానికి తగ్గొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే, ఇప్పుడే ఉద్దీపనలు ప్రకటించడానికి జపాన్ ప్రధాని షింజో అబే ఇష్టపడడం లేదు. ఇతర దేశాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉండగా జర్మనీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2019లో వృద్ధిరేటు 1.1 శాతం అధికంగా నమోదు చేసింది. దాంతో జర్మనీకి మిగులు బ డ్జెట్‌ ఏర్పడింది. 2020లోనూ జీడీపీ ఒక శాతం సర్‌ప్లస్‌లో ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణ కొరి యా, రష్యా కూడా అధిక నిధులతో మిగులు బడ్జెట్‌ను కలిగి ఉన్నాయి.

Next Story