నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం
By సుభాష్ Published on 5 May 2020 6:44 AM GMTఆస్తమా జబ్బులో బాధపడువారు కూడా దేశంలో చాలా మందే ఉన్నారు. అస్తమా సమస్య ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడం అనేది చాలా కష్టం. ముందుగా దగ్గు వస్తుంది. తర్వాత అతికష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. ఈ జబ్బు ఏ వయసు వారికైనా రావచ్చు. ఆస్తమాతో బాధపడేవారు ముఖ్యంగా రాత్రి వేళల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రాత్రి సమయాల్లోనే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.
ఈ జబ్బు ఉన్నవారికి మృత్యువాత పడే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బుబారిన పడేవారు అధిక శాతం పురుషులే ఉంటున్నారని వైద్యులు చెబుతున్న మాట. మరి పిల్లల్లోనైతే ఈ బబ్బు వేగంగా వస్తుందంటున్నారు.
మన శరీరంలో ముఖ్యంగా శ్వాస వాహికలు రెండు నుంచి మూడు సెంటీమీటరర్ల వ్యాసంలో ఉంటుంది.
ఇది రెండు బ్రోంకైలుగా విభజించబడి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు సంబంధించింది. వీటిలో అతి చిన్నదైన నాళం వ్యాసం కొన్ని మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఊపిరితిత్తులు కుచించుకుపోతే రోగికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పెంపుడు జంతువులు, సుగంధ ద్రవ్యాలు, దూది, బిస్కెట్, కేక్, ఊరగాయ, జామ్, సాస్ ఇంకా మూతపెట్టిన పదార్థాల నుంచి ఆస్తమా రోగులు దూరంగా ఉంటే ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో ఇబ్బంది
ముఖ్యంగా ఆస్తమా బాధపడేవారు చలికాలంలో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్పర్ డై ఆక్సైడ్, ఓజోన్ వాయువులు కాలుష్యాన్ని పెంచేస్తాయి. కర్మాగారాల నుంచి వచ్చే పొగలో ఎన్నో హానికరమైన పదార్థాలుంటాయి. ఇది ఆస్తమాను మరింత పెంపొందిస్తుంది. ఈ రోగులు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ ఉండాలంటున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆస్తమా రోగులు ఇన్‌హేలర్‌ను ఉపయోగిస్తున్నారు.
దీంతో రోగికి వెంటనే ఉపశమనం కలుగుతంది. ఆస్తమా నుంచి ఉపశమనం కలగాలంటే ధూమపానం అలవాటు ఉండకూడదు. అంతేకాదు ఇతరులు పొగతాగుతూ ఉంటే దూరంగా ఉండాలి. చల్లటి ద్రవ పదార్థాలను వాడకుండా ఉండాలి. చలికాలంలో మరింత జాగ్రత్తలు వహించాలి.
త్వరగా అలసిపోయే పనులు అస్సలు చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తమాను వ్యాయమంతో కూడా దూరం చేసుకోవచ్చని, పరిశుభ్రమైన వాతావరణంలో ఊపిరి తీసుకుని వ్యాయమం చేయాలంటున్నారు వైద్యులు. ఏది ఏమైనప్పటికి వైద్యుల సలహాలు పాటించనిదే మందులు వాడకూడదంటున్నారు వైద్యులు.