ఎండాకాలంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో జనాలు ఎండ నుంచి తప్పించుకుంటున్నారు. లేకపోతే భారీ ఎండల కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారిన పడటం, వడదెబ్బ తగలడం, కొందరు చనిపోవడం లాంటివి ఎన్నో జరిగేవి.

ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో   నీరసం వస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము.

ఇక వేసవి కాలంలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ, నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రసాలు తాగడం వల్ల కలిగి ప్రయోజనాలు

►ఈ జ్యూస్‌లలో విటమిన్‌-ఎ,సిలు అధికంగా ఉంటుంది
► మలబద్దంగా సమస్య నుంచి గట్టెక్కుతాం
►ఎండ వేడి కారణంగా మూత్రంలో మంటను తగ్గించుకోవచ్చు.
►కిడ్నీలలో రాళ్లు రాకుండా చేస్తాయి
► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.
► పేగులు కూడా శుద్ది అయి మంచి ఫలితం ఉంటుంది
► ఎసిడిటి, అల్సర్‌ రాకుండా కాపాడుతాయి
► ముఖ్యంగా నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ లభిస్తాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది.
► ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి
► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది
► అధిక బరువును తగ్గించుకోవచ్చు
► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
► గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు
► మధుమేహం వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు
► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.