ముఖ్యాంశాలు

  • కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుళ్లపూడిలో ఉద్రిక్తత
  • పోలీసులను నిర్బంధించిన గ్రామస్తులు
  • పోలీసుల కళ్లలో కారం చల్లి జీపుల టైర్లలో గాలి తీసేసిన గ్రామస్తులు

కృష్ణా జిల్లా ముసునురు మండలం గుళ్లపూడిలో శనివారం రాత్రి ఉద్రిక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివాహిత శ్రావణి పురుగుల మందు తాగి అనుమానస్పదంగా ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను హుటా హుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే వరకట్న వేధింపులతో శ్రావణి భర్త, అత్తమామలు బలవంతంగా పురుగుల మందు తాగించి చంపారంటూ మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శ్రావణి మృతదేహన్ని విజయవాడ నుంచి స్వగ్రామం గుళ్లపూడికి పోలీసులు తీసుకువచ్చారు. పోలీసులు శ్రావణి మృతదేహన్ని రహస్య ఖననం చేయడాన్ని గ్రామస్తులు అడ్డుకొని నిర్బంధించారు. ఆగ్రహంతో పోలీస్‌ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. నిందితుడైన శ్రావణి భర్త శివాజీకి కఠిన శిక్ష వేయాలని.. మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు భారీగా మోహరించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.