విజయవాడ: మహిళలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మహిళలపై సైబర్‌ నేరాలు తీసుకోవల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడారు. మహిళలపై సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నేరస్తులను పట్టుకోవడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మహిళల వేధింపులకు కారణం అవుతున్నాయని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని మంత్రి సుచరిత తెలిపారు. సైబర్‌ నేరస్తులను అరికట్టేందుకు సైబర్‌ మిత్రను ఏర్పాటు చేశామన్నారు. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుచరిత తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.