'కిలాడి లేడి' అరెస్ట్.. తన 'స్కెచ్'లు చూస్తే షాకే..!
By Medi SamratPublished on : 8 Nov 2019 6:07 PM IST

అమాయకులైన యువకులను మాయమాటలతో లోబర్చుకొని బ్లాక్‌మెయిలింగ్ కు పాల్పడుతూ వారివద్ద నుండి డబ్బులు గుంజుతున్న మాయలేడి సాదాన్ సుల్తానా నిజామీని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 21మంది యువకులను వేధించి.. వారిపై పోలీసుస్టేషన్ లలో పిర్యాదు చేసి డబ్బులు గుంజింది ఈ మాయలేడి.
అయితే.. ఓ యువకుడు ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫరిదిలో ఆత్మహత్యకు పాల్పడి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఓ యువకుడి కుటింబికులు ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కిలాడి లేడిని అరెస్ట్ చేశారు.
Next Story