సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. నమమాసాలు మోసిన కన్నబిడ్డను మద్యం మత్తులో ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మంగళవారం హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మద్యం మత్తులో ఓ మహిళ రూ.45 వేలకు ఓ మధ్యవర్తి ద్వారా తన బాబుని విక్రయిస్తుండగా.. ఆ మహిళతో పాటు మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని హబిబ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సుబాన్‌పురాకు చెందిన అబ్దుల్‌ జోయాఖాన్, అబ్దుల్‌ ముజాహిద్‌ భార్యాభర్తలు. వీరికి షేక్‌ 2 నెలలు కుమారుడు ఉన్నాడు. ముజాహిద్‌ ఎర్రమంజిల్‌ కాలనీలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ మద్యం తాగి తరచూ గొడవ పడేవారన్నారు. ఈ క్రమంలో 3న ఇంటి నుంచి ముజాహిద్‌ బయటకు వెళ్లి 8వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంట్లో తన రెండు నెలల కుమారుడు అద్నాన్‌ కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హబిబ్‌ నగర్ పోలీసులు కాలాపత్తర్‌కు చెందిన సిరాజ్‌ అనే మహిళకు రూ.45 వేలకు బాలుడ్ని విక్రయించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురుని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. బాలుడిని ధర్మాసనం ద్వారా తల్లికి అప్పగించామని తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.