అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
By రాణి Published on 9 April 2020 10:53 AM IST
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడుకొండలు, శమంతకమణి దంపతుల కూతురు పూజ అంబికా (21). పూజ తల్లిదండ్రులు వృత్తి రీత్యా టైలరింగ్ పని చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పూజ బి.టెక్ కంప్యూటర్స్ చదువుతోంది. డిగ్రీ చదువుతూనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తోంది.
Also Read : మా ఆకలిని ఎవరు తీరుస్తారంటున్న ట్రాన్స్ జెండర్లు
ముగ్గురు కష్టపడుతుండటంతో కుటుంబంలో ఎలాంటి చిక్కులు లేకుండా సరదాగా సాగిపోతోంది వారి జీవితం. ఇంతలోనే పూజ శవమై కనిపించింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో అందరూ వాకింగ్ కు వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ వద్ద పూజ మృతదేహం కనిపించింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూజ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా ? లేక ఎవరైనా హత్య చేశారా ? ఆత్మహత్యే అయితే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది..ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే..పూజను హత్య చేసేంత అవసరం ఎవరికి ఉంటుంది ? ఇవేమీ కాకపోతే పూజపై అత్యాచారం చేసి..హత్య చేసి ఉంటారా ? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు స్థానికులను, పూజ ఇంటి చుట్టుపక్కల వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : లాక్‌డౌన్ వేళ ఏపీలో ఆసక్తికర భేటీ..