ప్రమాదవశాత్తు బస్సు కింద పడి యువతి మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 6:56 AM GMTహైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రోడ్డు ప్రమాద నివారణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. తాజాగా నగరంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు ఓ స్కూటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కింద పడింది. దీంతో స్కూటీపై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి సైదాబాద్‌కు చెందిన కావ్య (23) స్థానికులు గుర్తించారు. కావ్య ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్ రాయాడనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు కింద పడడంతో కావ్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.