Fact Check : బిడ్డను వెనుక కట్టుకుని, సైకిల్‌పై వెళుతున్న తల్లి ఫోటో భారత్ లోనిదేనా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 8:39 AM GMT
Fact Check : బిడ్డను వెనుక కట్టుకుని, సైకిల్‌పై వెళుతున్న తల్లి ఫోటో భారత్ లోనిదేనా.!

కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసింది. లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజు కూలీలు, వలస కార్మికులే..! ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయారు. కొందరు కాలినడకన సైకిల్ లో కూడా తమ తమ ప్రయాణాలు చేసి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

తాజాగా ఓ మహిళ తన బిడ్డను వెనుక కట్టుకుని సైకిల్ లో వెళుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఒక వలస కార్మికురాలని.. తన సొంత ఊరు వెళ్ళడానికి అలా సైకిల్ లోనే ప్రయాణం మొదలుపెట్టిందని పలువురు ఫోటోలను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

@VinodYadav5172 అనే ట్విట్టర్ అకౌంట్ లో భారత దేశంలో వలస కార్మికుల అవస్థలు ఇలా ఉన్నాయని.. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉండగా.. పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని అందులో పేర్కొన్నారు.



సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ మినిస్టర్ రన్ దీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఈ ఫోటోను మే 19న ట్వీట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. మదర్స్ డే రోజున కూడా భారత్ లో తల్లులు పిల్లల కోసం ఏదైనా చేస్తారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.





నిజమెంత:

న్యూస్ మీటర్ ఈ ఫోటోను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి చూడగా.. ఈ ఫోటోలు గత ఐదేళ్లుగా తెగ వాడుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ ఫోటో భారత్ కు చెందినదే కాదని తెలుస్తోంది.

2015 లో హంగేరియన్ వెబ్ సైట్ https://cafeblog.hu ఈ ఇమేజ్ ను పోస్టు చేసింది. “Mom with a child and a bike? Well, nana!” అంటూ ట్రాన్స్లేట్ చేసిన ఆర్టికల్ మనం చూడొచ్చు.

https://anyamborogass.cafeblog.hu/2015/08/31/anyuka-gyerekkel-meg-biciklivel-hat-nana/

Fact1

Fact2

Pinterest లో కూడా ఈ ఫొటోకు సంబంధించిన సమాచారాన్ని కొందరు పెట్టారు. నేపాల్ గంజ్, నేపాల్ లో ఓ తల్లి ఇలా వెళుతోందని తెలిపారు. అందుకు సంబంధించిన ఇమేజ్ లింక్

https://in.pinterest.com/pin/591308626045867490/

Fact3

ఈ ఫోటో భారత్ కు చెందినదని అని చెప్పే ఒక్క సాక్ష్యం కూడా న్యూస్ మీటర్ కు లభించలేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా కూడా ఇది పాత ఫోటో అని.. భారత్ కు చెందిన ఫోటో కాదని తేల్చి చెప్పింది. పాత ఫోటోలను ఉపయోగించి ఇప్పుడు వలస కార్మికులకు చెందిన ఫోటో అని చెబుతున్నారని.. నమ్మకండి అని ట్వీట్ చేశారు.

“Claim: Message circulating on Social Media with an image, of a woman riding a bicycle with baby on her back, attributing to Migrant situation in the country. #PIBFactCheck: #Fake. The image is old and NOT from India. Beware of Old images & videos being shared out of context (sic).”



నిజమేమిటంటే:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహిళ సైకిల్ పై తన బిడ్డను మోసుకువెళుతోందన్న వార్త కూడా నిజం కాదు.

Claim Review:Fact Check : బిడ్డను వెనుక కట్టుకుని, సైకిల్‌పై వెళుతున్న తల్లి ఫోటో భారత్ లోనిదేనా.!
Claim Fact Check:false
Next Story