కోహ్లీని పొగుడుతున్నందుకు అక్త‌ర్ పై గుస్సా.. వారికి ఏమని సమాధానం చెప్పాడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sept 2020 8:48 AM IST
కోహ్లీని పొగుడుతున్నందుకు అక్త‌ర్ పై గుస్సా.. వారికి ఏమని సమాధానం చెప్పాడంటే..?

పాకిస్థాన్ జట్టు మాజీ పేస్ బౌలర్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై పలుమార్లు ప్రశంసల వర్షం కురిపించాడు. పలు భారత ఆటగాళ్లను కూడా అఖ్తర్ ప్రశంసలతో ముంచెత్తుతుంటూ ఉంటాడు. ఈ విషయంపై చాలా మంది అఖ్తర్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉంటారు. విమర్శలు కురిపిస్తున్న వాళ్లపై అఖ్తర్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఆటతీరు చూస్తుంటే ఎవరైనా పొగుడుతారని అఖ్తర్ సమాధానం ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ లో అఖ్తర్ మాట్లాడుతూ పాకిస్థాన్ లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చూసి నేర్చుకోవాలని అన్నాడు. దీన్ని చాలా మంది పాకిస్థాన్ అభిమానులు తప్పుబట్టారు. దీనిపై అఖ్తర్ బాగా గట్టిగానే ఇచ్చాడు.

'భారత క్రికెటర్లను, విరాట్ కోహ్లీని ఎందుకు ప్రశంసించకూడదో మీరే సమాధానం చెప్పాలి..! పాకిస్థాన్ జట్టులో ఏ ఒక్కరైనా విరాట్ కోహ్లీ రికార్డులకు దగ్గరగా వచ్చారా..? ఎందుకు నా మీద ఆగ్రహంగా ఉన్నారో.. నన్ను తప్పుబట్టే ముందు కోహ్లీ గణాంకాలను పరిశీలిస్తే బాగుంటుంది. అతడు భారతీయుడని మనసులో ద్వేషం పెంచుకోమని అంటారా.. అందుకోసమే పొగడకుండా ఉండమంటారా..?' అంటూ అఖ్తర్ సమాధానం ఇచ్చాడు.

'కోహ్లీ 70 ఇంటర్నేషనల్ సెంచరీలను బాదాడు.. ప్రస్తుతమున్న క్రికెటర్లలో ఎవరు అన్ని సెంచరీలు కొట్టారో చెప్పండి..? భారత్ కు ఎన్నో సిరీస్ లు గెలిపించాడు.. పొగడకుండా ఎలా ఉండమంటారు. కొందరి వాదన చాలా వింతగా ఉంది. ప్రపంచంలోనే పెద్ద బ్యాట్స్మెన్ అతడిని అందరికీ తెలిసిపోతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ భారత్ కు చాలా బాగా ఆడుతున్నారు' అని అన్నాడు.

31 సంవత్సరాల వయసులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 416 అంతర్జాతీయ మ్యాచ్ లలో 21,901 పరుగులు చేశాడు. ఒక్కో ఏడాది కోహ్లీ తన పరుగుల వరదను పారిస్తూనే ఉన్నాడు.

Next Story