ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ నేత విస్ణువర్ధన్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేశారు..?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 3:12 PM ISTఢిల్లీ: ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌ను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాజకీయ ప్రత్యర్థులు తన పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిని శిక్షించాలని విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని కిషన్‌రెడ్డికి తెలిపారు.
రాజకీయ కక్షతో రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు.
సోషల్ మీడియాలో తనపై ఇతర కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నటువంటి కథనాలకు సంబంధించి మార్ఫింగ్ చేసిన ఫొటోలను వైరల్ చేస్తున్న కథనాలపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు మరో ఫిర్యాదు చేశారు.
యువజన క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పేరుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో మంత్రిత్వ శాఖ అధికారి ఎ.కే. అమిత్ ఘా పిర్యాదు చేశారు.