హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడడం ఆపండి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 8:13 PM IST
హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడడం ఆపండి.!

యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వాడడం ద్వారా కోవిద్-19ను అరికట్టవచ్చు అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా బహిరంగంగా వెల్లడించాడు. చాలా మంది రోగులను హైడ్రాక్సీక్లోరోక్విన్ కాపాడింది అని చెప్పుకొచ్చారు. కానీ కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ పై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

ఈ మెడిసిన్ తో కరోనా పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని.. ఈ డ్రగ్ వాడిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు హెచ్.ఐ.వి. కి ఉపయోగించే లోపినవిర్‌/రిటోన‌విర్ ట్ర‌య‌ల్స్‌ను కూడా నిలిపివేస్తామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఆసుపత్రి పాలైన కోవిద్ పేషెంట్స్ ప్రాణాలు కాపాడడంలో ఇవి విఫలమవ్వడంతో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకటే రోజే ప్రపంచవ్యాప్తంగా 2,00,000 కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదయిన సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్‌/రిటోన‌విర్ వాడినప్పటికీ కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌ఓ స్టేట్మెంట్ లో తెలిపింది.

ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యు.ఎన్. ఏజెన్సీ తెలిపింది. ఇక గిలీడ్ సంస్థ రెమ్దెసివిర్ ట్రయల్స్ మీదే ఆశలు పెట్టుకుంది. యూరోపియన్ కమీషన్ కూడా రెమ్దెసివిర్ విషయంలో కండీషనల్ అప్రూవల్ ను ఇచ్చింది. దాదాపు అయిదు బ్రాంచ్ లలో కోవిద్-19 ట్రీట్మెంట్ విషయంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జెనరల్ టెడ్రోస్ అధానమ్ గీబ్రెయేసుస్ శుక్రవారం నాడు మాట్లాడుతూ 39 దేశాల్లో 5500 పేషెంట్స్ పై క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు. మధ్యంతర రిజల్ట్స్ రావడానికి రెండు వారాలు ఎదురుచూడాల్సి ఉంటుందని తెలిపారు. 18 ప్రయోగాత్మక కోవిద్-19 వ్యాక్సిన్లు పరీక్షల దశల్లో ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఎమెర్జెన్సీస్ ఎక్స్పర్ట్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ వ్యాక్సిన్లు మనుషులపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోడానికి ఈ ఏడాది చివరి వరకూ ఎదురుచూడాల్సి ఉందని ఉంటుందని అన్నారు.

Next Story