రైల్వేలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

By సుభాష్  Published on  19 May 2020 10:51 AM IST
రైల్వేలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది రైల్వేశాఖ. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు పశ్చిమ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోవిడ్‌-19 ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేసేందుకు పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకుంటోంది. హెమోడయాలిసిస్‌ టెక్నీషియన్‌, ఆస్పత్రి అటెండెట్స్‌, హౌజ్‌ కీపింగ్‌ అసిస్టెంట్, కాంట్రాక్ట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 175 ఖాళీలను భర్తీ చేయనుంది.

ఇవి మూడు నెలల కాంట్రాక్ట్ పోస్టులు. అయితే తర్వాత అవసరాలను బట్టి పొడిగించనున్నారు. ముంబైలోని జగ్జీవన్‌ రామ్‌ రైల్వే ఆస్పత్రిలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 24 చివరి తేదీ. పూర్తి వివరాలకు https://wr.indianrailways.gov.in/ వెబ్‌ సైట్‌లో సంప్రదించాలి.

మొత్తం పోస్టులు - 175

హౌజ్‌ కీపింగ్‌ అసిస్టెంట్‌ - 90

హాస్పిటల్‌ అటెండెంట్స్‌ -65

సీఎంపీ జీడీఎంఓ - 9

-----------------------------------------------------

Next Story