దారుణం.. భార్యకు ప్రియుడిపై మోజు.. తండ్రితో కలిసి భర్తను

By అంజి  Published on  30 Jan 2020 8:04 AM GMT
దారుణం.. భార్యకు ప్రియుడిపై మోజు.. తండ్రితో కలిసి భర్తను

పశ్చిమగోదావరి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కోపంతో ఓ భార్య తన భర్తను అడ్డు తొలగించుకుంది. ప్రియుడితో కలిసి తిరుగుతుంటే తరచు అడ్డుతగులుతున్నాడని భర్తను కాటికి పంపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కలవచర్ల గ్రామానికి చెందిన అప్పారావు, వేణు ఇద్దరు భార్య భర్తలు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉండడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే భార్య వేణుకి తునికి చెందిన వనశెట్టి మురళీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త తరచూ గ్రామానికి వచ్చివెళ్లేవాడు. దీంతో వేణు, మురళిలు తమ వివాహేతర బంధాన్ని తునికి మార్చారు. అయితే అక్కడే ఎలాగైన భర్తను పూర్తిగా వదిలించుకోవాలని భార్య వేణు పన్నాగం పన్నింది. దీని కోసం ప్రియుడు మురళి, అతడి స్నేహితుడు లావేటి భాను, తండ్రి గున్నయ్యలను వాడుకుంది. ఫూటుగా మద్యం సేవించి గ్రామానికి వచ్చిన అప్పరావును ప్రణాళికలో భాగంగా వేణు తండ్రి బస్టాప్‌లో పడుకోబెట్టాడు. ఆ తర్వాత మురళి, భానులు అక్కడి వెళ్లి లారీకి చెందిన వస్తువుతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు.

ఈ నెల 17న జరిగిన ఈ దారుణ ఘటన డి.పోలవరం బస్టాప్‌ వద్ద జరిగింది. గతంలోనే భర్త చల్లపల్లి అప్పరావుపై దొంగతనం, లైంగిక దాడి కేసులు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సహకరించిన గున్నయ్య బుధవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. అతడిని విచారించిన పోలీసులు మిగతా నిందితులైన వేణు, మురళి, లావేటీ భానును అరెస్ట్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించామని పోలీసులు తెలిపారు.

Next Story
Share it