ఇత‌ర రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లై పారుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వ‌ర్షాల‌తో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా పిడుగుపాటుకు 11 మంది బ‌ల‌య్యారు. అలాగే న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంకురా, పూర్బ బ‌ర్ధ‌మాన్‌, హౌరా మూడు జిల్లాల్లో పిడుగు ప‌డి 11 మంది ప్రాణాలు విడిచారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్భ బ‌ర్ధ‌మాన్ జిల్లాలో ఐదుగురు, హౌరాలో ఒక‌రు మ‌ర‌ణించారు.

బంకురా జిల్లాలో ఓ పొఒలంలో ప‌ని చేస్తుండ‌గా, పిడుగులు ప‌డి వీరు మ‌ర‌ణించిన‌ట్లు అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. మిగితా జిల్లాల్లో వేర్వేరు గ్రామాల్లో పిడుగులు ప‌డి మిగ‌తా వారు మ‌ర‌ణించారు. ఇక రాగాల రెండు రోజుల పాటు ద‌క్షిణ ప‌శ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *