భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 11 మంది మృతి
By సుభాష్ Published on 28 July 2020 5:10 PM ISTఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి వరదలై పారుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు 11 మంది బలయ్యారు. అలాగే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా మూడు జిల్లాల్లో పిడుగు పడి 11 మంది ప్రాణాలు విడిచారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్భ బర్ధమాన్ జిల్లాలో ఐదుగురు, హౌరాలో ఒకరు మరణించారు.
బంకురా జిల్లాలో ఓ పొఒలంలో పని చేస్తుండగా, పిడుగులు పడి వీరు మరణించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మిగితా జిల్లాల్లో వేర్వేరు గ్రామాల్లో పిడుగులు పడి మిగతా వారు మరణించారు. ఇక రాగాల రెండు రోజుల పాటు దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.