తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు
Two more days of heavy rains in Telugu states. దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
By అంజి Published on 7 Sept 2022 9:53 AM IST
దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా గత రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఉందని వాతావరణ కేంద్రం. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో కూడా భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అదే రోజుల్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 10న తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.