బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన

మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

By -  Knakam Karthik
Published on : 3 Nov 2025 1:51 PM IST

Weather News, Telangana, Hyderabad Meteorological Department, Rain Alert

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన

మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురిసింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివేళల వరకు చెదురుమదురు వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అది మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారినప్పటికీ, దాని ప్రభావం వర్షాల రూపంలో తెలంగాణపై పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

ఈ కారణంగా రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story