Telangana: వచ్చే 5 రోజులు ఎండలు.. జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

By అంజి  Published on  24 March 2024 1:04 AM
Temperatures, Telangana , IMD

Telangana: వచ్చే 5 రోజులు ఎండలు.. జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామని ఐఎండీ చెప్పింది. హైదరాబాద్‌లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయిగా గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.

ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిన్న రాష్ట్రంలోనే అధికంగా నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడలో, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్‌ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పైనే నమోదు అవుతోంది.

Next Story