అల‌ర్ట్‌.. రాబోయే 5 రోజులు తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌

Telangana likely to get light to moderate rains for next 5 days.రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 Sept 2022 3:56 AM

అల‌ర్ట్‌.. రాబోయే 5 రోజులు తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌

ప‌శ్చిమ‌, నైరుతి వాయుగుండం ప్ర‌భావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ) అంచ‌నా వేసింది. హైద‌రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ఈ అంచనాకు భౌగోళిక దృగ్విషయం ప్ర‌ధాన కార‌ణం అని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.

"ప్రస్తుతం.. తెలంగాణ రాష్ట్రంపై పశ్చిమ, నైరుతి వాయుగుండం ఎక్కువ‌గా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సినాప్టిక్ పరిస్థితి సూచిస్తుంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితులతో ప్లస్ లేదా మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌తో ఉండే అవకాశం ఉంది." అని అన్నారు.

తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభంలో ఎడతెరిపి లేకుండా కురిసిన‌ భారీ వర్షాల కార‌ణంగా ఇప్ప‌టికే చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు నిండు కుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి.

Next Story