ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్.. రేపు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారబాద్, నారాయణపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని వెల్లడించింది. అలాగే ఎల్లుండి నాగర్‌కర్నూల్, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీమ్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు హైదరాబాద్‌లోనూ ఉదయం పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.