నేడు, రేపు తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 7:34 AM ISTనేడు, రేపు తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందనీ.. దీని ప్రభావంతో పలు చోట్ల వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్లగొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కంటే రెండు ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదు అవుతున్నాయి.
ఇక మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపోయావరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలో రెండ్రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాలో పొగమంచు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దక్షిణ కోస్తాలో కూడా రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.