తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండండి

Rain forecast for Telugu states. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

By M.S.R  Published on  29 May 2023 1:00 PM GMT
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండండి

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో వడగళ్ల వాన కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడుతాయని తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాడు కోస్తా ప్రాంతంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ.వేగంతో వీచే అవకాశముంది.


Next Story