తెలంగాణ రాష్ట్రంలో జూలై19 వ‌ర‌కు 112 శాతం అధిక వ‌ర్షాపాతం న‌మోదు

Rain bounty Despite sluggish monsoon TS gets 112% excess rainfall till 19 July.సాధార‌ణ వ‌ర్షాపాతంతో పోలిస్తే నైరుతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 3:05 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో జూలై19 వ‌ర‌కు 112 శాతం అధిక వ‌ర్షాపాతం న‌మోదు

సాధార‌ణ వ‌ర్షాపాతంతో పోలిస్తే నైరుతి రుతుప‌వ‌నాల కార‌ణంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న‌టి వ‌ర‌కు(జూలై 19) 112 శాతం అధిక వ‌ర్షాపాతం న‌మోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) జూలై 19 న విడుదల చేసిన తాజా డేటా ప్రకారం సాధారణంగా జూన్ 1 నుంచి జూలై 19 వరకు రాష్ట్రంలో దాదాపు 267.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది అదే కాలంలో 567.4 మి.మీ కురిసింది. 2021లో ఇదే కాలంలో కురిసిన వర్షపాతం కంటే దాదాపు 41 శాతంఎక్కువ. అంటే 402.2 మి.మీ అధికం.

సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలం అంటారు. తెలంగాణ వార్షిక వర్షపాతం మొత్తం 906.3 మి.మీ కాగా.. దాదాపు 80 శాతం అంటే 721.2 మి.మీ లు నైరుతి రుతుప‌వ‌నాల సీజ‌న్ పూర్తి కాక‌ముందే కురిసింది. ఇక గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూడా జూన్ 1 నుంచి జూలై 19 మ‌ధ్య‌ 319.6మి.మీట‌ర్ల వ‌ర్షాపాతం న‌మోదైంది. సాధారణ‌ వ‌ర్ష‌పాతం 207.7మి.మీ పోలిస్తే ఇది 54 శాతం అధికం.

మాయా వర్షం:

జూలై 1 నుండి జూలై 19 వరకు సాధార‌ణంగారాష్ట్రంలో 138.2 మి.మీ వర్షపాతం నమోదు అవుతూ ఉంటుంది. అయితే ఈ సంవ‌త్స‌రం సాధార‌ణం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ‌ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూలై 1 నుంచి 19 మ‌ధ్య దాదాపు 416.8మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యింది. అంటే 202శాతం అధికం అన్న‌మాట.ఇక 2022 జూన్ నెల‌లో కూడా తెలంగాణలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం 129.3మి.మీతో పోలిస్తే 16 శాతం అధికంగా న‌మోదు అయ్యింది. అంటే 150.6మి.మీ వ‌ర్ష‌పాతం కురిసింది. అయితే.. ఇది 2021 జూన్ నెల‌లో పోలిస్తే 22 శాతం త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు 194.3మి.మీ వ‌ర్షం కురిసింది.

జూలై నెల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. రాష్ట్రంలో 244.4 మి.మీ సాధారణ వర్షపాతంగా న‌మోదైంది. అదే స‌మ‌యంలో 24 గంటల్లో అత్యధికంగా 2013 జూలై 19న ములుగులోని వాజీద్‌లో 517.5 మి.మీ వ‌ర్షాపాతం కురిసింది.

నిజామాబాద్‌లో 187శాతం అదనపు వర్షపాతం

1 జూన్ నుండి 19 జూలై 2022 వరకు నిజామాబాద్‌లో 950.1 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ కాలంలో సాధార‌ణ వ‌ర్షాపాతం 331.5 మి.మీ కాగా.. ఈ ఏడాది 187 శాతం అధిక వ‌ర్షాపాతం న‌మోదైంది.

ఈ ఏడాది అధిక వర్షపాతం విషయానికి వస్తే నిజామాబాద్ తర్వాత జగిత్యాల, కరీంనగర్ ఉన్నాయి. జగిత్యాలలో సాధారణం కంటే దాదాపు 176శాతం ఎక్కువ న‌మోదైంది. సాధారణ వ‌ర్షాపాతం 342.2 మి.మీ.కాగా.. 944.6 మి.మీ కురిసింది. కరీంనగర్‌లో సాధార‌ణ వ‌ర్షాపాతం 274.3మి.మీ కాగా.. 753.3 మి.మీ కురిసింది. అంటే 175 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది.గ‌మ‌నించిన‌ట్ల‌యితే.. జూన్ 1 నుండి జూలై 19 వరకు తెలంగాణలోని 33 జిల్లాలలో 29 జిల్లాలు అధిక వర్షపాతాన్ని పొందాయి. ఈ జిల్లాలో సాధార‌ణం కంటే 60 శాతం లేదా అంత‌కంటే ఎక్కువ వ‌ర్షాపాతం న‌మోదైంది. వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ మరియు జోగులాంబ గద్వాల్ ల‌లో వరుసగా 58%, 54%, 44% మరియు 33% అధిక వర్షపాతం నమోదైంది.


కాగా.. రాష్ట్రంలో గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమ‌లగిరిలో 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


గత 7 రోజుల వర్షపాతం

అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌లో ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయని ఐఎండీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు.

తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా పేరుగాంచిన టి.బాలాజీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మనకు రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ఛత్తీస్‌గఢ్-విదర్భ ప్రాంతంలో దాదాపు ఆరు రోజులుగా నిలిచిపోయిన అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయని ఆయన చెప్పారు. "గత 7 రోజుల వర్షపాతం క్రమరాహిత్యానికి లేదా తెలంగాణలో వర్షపాతం గణాంకాలలో గణనీయమైన పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. గత వారంలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షపాతం ఉత్తర తెలంగాణలో వరదలను తెచ్చిపెట్టింది" అని బాలాజీ చెప్పారు.

ఇప్పుడు తెలంగాణలో రుతుపవనాల విరామ పరిస్థితి ఉందని, అంటే రుతుపవనాల ద్రోణి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉందని ఆయన అన్నారు. కాబట్టి శుక్రవారం వరకు పెద్దగా వర్షాలు కురవవు. ద్రోణి ఏర్పడడంతో శుక్రవారం నుంచి వర్షాలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు.

రానున్న ఐదు రోజుల వర్షపాతం గురించి నాగరత్న మాట్లాడుతూ.." మొదటి మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత నాలుగు, ఐదో రోజుల్లో పలు జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. "

Next Story