ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 9:15 AM GMTముందుగానే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి మొత్తం నిరంతరాయం వర్షం పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. ఆ తర్వాత వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని చెప్పారు.
నాగర్‌కర్నూల్, గద్వాల్, నల్లగొండలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పాటుగా రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణను తాకుతాయి నైరుతి రుతుపవనాలు. కానీ.. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముందుగానే పంటలు వేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక మంగళవారం నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.