తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి
Published on : 23 March 2025 10:53 AM IST

Meteorological Department, rain, several districts, Telangana

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు 

తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సాయంత్రం, రాత్రి వేళల్లో కూడా అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఛత్తీ‌స్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించి ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Next Story