ఏపీకి రెయిన్‌ అలర్ట్‌.. 3 రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి
Published on : 16 July 2025 6:44 AM IST

Meteorological Department, light to moderate rains, APnews

ఏపీకి రెయిన్‌ అలర్ట్‌.. 3 రోజుల పాటు వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అటు తెలంగాణలో నేడు కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Next Story