తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య...
By - అంజి |
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెట్ల కింద ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల,కడప, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 12, 2025
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 12, 2025