బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి
Published on : 25 July 2025 7:45 AM IST

Meteorological Center, Telugu states, heavy rains

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏఎపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రానున్న 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు ఛాన్స్ ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అటు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండో రోజు వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో నిన్న ముసురేసింది. ఇవాళ కూడా ముసురు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Next Story