రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి
రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 1, 2025
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బుధవారం శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు,ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.#WeatherUpdate #AndhraPradesh pic.twitter.com/B8GKqlrbu4
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 1, 2025