ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ వచ్చేసింది. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
నేడు : రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం
రేపు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లుండి : రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం
వర్షాలు కురిసే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.