తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు

Heavy rains for 3 days in AP and Telangana. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో గురువారం నుంచి శనివారం వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షాలు

By అంజి  Published on  29 Sep 2022 11:10 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో గురువారం నుంచి శనివారం వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, యానాం వర్షాలు కురవనున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

రాగల 24 గంటల్లో తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ జిల్లాలకు 'ఎల్లో' అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన రోజువారీ నివేదికలో పేర్కొంది.

Next Story