దక్షిణ తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ వాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీచేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ సిటీలో శుక్రవారం తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు తెలిపింది. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వానతో హైదరాబాద్‌లో అతలాకుతలం అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వాన కురవగా, ములుగు జిల్లాలో ఓ బ్రిడ్జి కుప్పకూలింది.