గుజరాత్ తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్ తీవ్ర తుపాను
బిజోర్‌జాయ్ తీవ్ర తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తారాన్ని తాకింది. దీని ప్రభావంతో
By Srikanth Gundamalla Published on 15 Jun 2023 2:55 PM GMTగుజరాత్ తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్ తీవ్ర తుపాను
బిజోర్‌జాయ్ తీవ్ర తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తారాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే. అత్యంత తీవ్ర తుపానుగా బలబడిన ఈ బిపోర్‌జాయ్ పూర్తి భూభాగంపైకి చేరేందుకు ఈ అర్ధరాత్రి వరకు సమయం పడుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ వెల్లడించింది.
గుజరాత్ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమాయానికి గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. తుపాను పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను తీరం దాటిన ప్రాంతంలో ఉన్న 20 గ్రామాలకు చెందిన ప్రజలను అధికారులు ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరినే కాకుండా.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. గాలులు ఎక్కువగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదరైతే అధికారులకు తెలపాలని వివరించారు. ఇక సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుగానే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటే సమయంలో అక్కడ ఎవరూ తిరగకూడదని 144 సెక్షన్ కూడా విధించారు. ఇప్పటికే ఆలయాలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. విద్యుత్ శాఖకు చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సంసిద్ధమయ్యాయి. అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సేవలను కూడా రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక వర్షాలను దృష్టిలో పెట్టుకుని పలు రైళ్లను కూడా రద్దు చేశారు. ఏదైమైనా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.